Thursday, 10 December 2009

తెలంగాణా ప్రజల కథ సుఖాంతమా??

తెలంగాణా వచ్చింది.. చాలా సంతోషం.. ఎవ్వరికైతే తెలంగాణా రావాలి అని కోరిక ఉండిందో వారికి నా శుభాకాంక్షలు !!
కానీ తెలంగాణా గురించి ఇంతింత పొడుగు mails పంపించే వాళ్లకి కొన్ని ప్రశ్నలు:
అ) మీరు ఎన్నడైనా మీ ఊరిలో (no need whole telangana) ఒక్క సమస్య పైన అయిన ఒక పోరాటం చేసారా?
ఆ) మీ ఊరి సమస్య మీద మీ నాయకుడిని (MLA/MP/Mayor/Ward Councillor anyone) నిలదీశారా?
ఇ) మీ ఓటు మీరు ఉపయోగించుకునే ముందు.. అస్సలు మన ఊరిలో contest చేసే candidates eligibility ఏంటి అని ఆలోచించారా? మీ కుటుంబం తో ఈ విషయం discuss చేసారా?
ఈ) పోనీ last 5 years గా ఉన్న మీ ఊరి MLA/MP etc etc గాడు మీ ఊరికి ఏమి చేసాడు (మొరటు గా అడిగితే.. "ఏమి పొడిచాడు") అని ఆలోచించారా?
ఉ) ఎందుకు ఈ MLA మనకు ఏమి చెయ్యలేదు అని అడిగారా?
ఊ) అసలు మీకు ఓటు ఉందా? ఉంటే ఎవరు వేస్తున్నారు? ఎవరికి వేస్తున్నారు?
ఎ) మీరు మీ దేశం వదిలి వచినప్పుడు మీ ఓటు cancel చెయ్యించుకున్నారా ?

ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు ఉన్నాయి లే.. కానీ ఇవేమీ చెయ్యకుండా .. తెలంగాణా కావాలి అని ఎవ్వడో కొంకిస్క గొట్టంగాడు నిరాహార దీక్ష చేస్తే .. ప్రత్యేక రాష్ట్రం వచేసింది అని మీరు ఇక్కడ సంకలు గుద్దుకుంటూ సంబరాలు చేసుకోవడం ఎంత వరకు సమంజసం??

ఎప్పుడైనా అభివృద్ధి grass root level లో జరగాలి. నీ ఊరిలో ఇన్నాళ్ళూ జరగని మంచి.. ఈ రోజు తెలంగాణా వస్తే జరిగిపోతుందా? ఇక్కడ గుర్తు పెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే .. తెలంగాణా రానప్పుడు మీ ఊరికి ఉన్న MLA/MP నే రేపు వచ్చాక కూడా ఉంటాడు. ఇన్నాళ్ళూ పెద్ద రాష్ట్రం మూలంగా వాడికి రాణి మంత్రి పదవి ఇప్పుడు వస్తుంది.. మునుపటి కన్నా ఎక్కువ సంపాదించుకుంటాడు.. నాకు తెలిసి అంతకు మించి తేడా ఉండదు..
కాబట్టి ప్రవాస తెలంగాణా (ప్రవాసాంధ్రులు అంటే మల్లి కోపం వస్తుందేమో) సోదరులకు నా విన్నపం ఏమిటంటే.. start your work at grass root level.. today.. right now... ఇప్పటికిప్పుడు తెలంగాణా divide అయిపోయినా రాష్ట్రం మీ చేతుల్లోకి రావడానికి 10 years పడుతుంది.. ఆ 10 years పాటూ అడ్డమైన రాజకీయ నాయకులూ సృష్టించిన కలలు కంటూ పడుకోకుండా .. development మీద దృష్టి పెట్టండి..teams form చేసుకోండి.. మీ తోటి ఆంధ్ర వాళ్ళని కూడా వీలు అయితే contribute చెయ్యమని చెప్పండి.. ఇక్కడ ఎవ్వడు ఏ ప్రాంతం నించి వచ్చాడు అన్నది కాదు ముఖ్యం.. మానవత్వం ముఖ్యం.

Already.. తెలంగాణా రాష్ట్రం తెలంగాణా రాష్ట్రం అని చెప్పి last 15 years గా తెలంగాణా లో development గురించి పట్టించుకోకుండా time అంత దాని మీదే ఫోకస్ చేసారు.. (ఫోకస్ చేసింది మీరు కాదులెండి..ఎవరో.. ఈ వేళ తెలంగాణా వచ్చింది కాబట్టి.. అందరు సంబరాలు జరుపుకుంటున్నారు.. అదే రాకపోయిఉంటే రేపు పొద్దున్న ఎవ్వరి పాటికి వాళ్ళు ఉద్యోగాలకి వెళ్ళే వారు)...

Along with anyone whomever you blame are responsible for the oppression of Telanganites, you are equally responsible too.
When you are not casting your vote for the right person,
when you are not questioning the person elected when the electrion promises are not kept,
when you re-elect the same person again and again though he did nothing for the betterment of your land,
when you are not creating political awareness in your own people about solutions for their problems,
you are definitely responsible for their defeat, their neglectedness and prolonging their problems. If you think you are not responsible, then you are not eligible to celebrate the birth of State Telangana.

After the State Telangana is formed, what are you going to do... NOTHING.. ఎవడో రాజకీయనాయకుడు నా తెలంగాణాని బాగు పరుస్తాడు అని ఆ రాష్ట్ర భవిష్యత్తు ని వాడికి అప్పచెప్పి చేతులు దులుపుకుంటారు .. ఈ మాత్రం దానికి దీనికి పోరాటం / ఉద్యమం అని పేరు దేనికో నాకు అయితే అర్థం కాదు.

Anyway.. My humble request to you all is.. ఎంతమంది వచ్చినా ఎంతమంది పోయినా.. ఎన్ని రాష్ట్రాలు వచ్చినా .. ఎన్ని పోయినా.. పేద వాడి బ్రతుకులో వెలుగు మాత్రం రాలేదు (అది ఏ రాష్ట్రం వాడైనా).. మీరు ఆ కడుపు మండే పేద వాడి బ్రతుకులో flood light వెలిగించక్కర్లేదు .. ఒక చిరుదీపం అయితే చాలు..

దేశమంటే మట్టి కాదోయ్ దేశమంటే మనుషులోయ్ అన్న విషయాన్ని గుర్తు ఉంచుకోండి. మట్టిని (రాష్ట్రాన్ని) విడదీసినంత మాత్రాన మనుషుల బ్రతుకులు అమాంతం మారిపోవు.. ఆ మనిషి బ్రతుకులో మార్పుకు ప్రయత్నించండి .. తెలంగాణా రాష్ట్ర అవతరణ తోనే మీ పని అయిపోయింది అని అనుకోకండి..

"తెలంగాణా నా జన్మహక్కు!! జై తెలంగాణా" అన్నా ఆ మాటలో నాకు ఎంతో గౌరవం ఆత్మాభిమానం కనపడతాయి.. దానికి నేను సంతోషిస్తున్నా .. ఎందుకంటే నీ జాతి గురించి.. నీ నెల గురించి .. నీ తల్లి గురించి నువ్వు గర్వపడాలి.. అది కరెక్ట్ .. కానీ ఆ హక్కు తో పాటు భాద్యత కూడా వస్తుంది..
"జై తెలంగాణా! తెలంగాణా నా జన్మహక్కు!! తెలంగాణా నా భాద్యత!!!" ఇది మీరు మీలో అనుకోవలసిన మాట.. అది మీ భాద్యత.. గుర్తుంచుకోండి..

జై హింద్.. మేరా భారత్ మహాన్
(ఈ బ్లాగ్ నేను ఎవ్వరినో బాధ పెట్టడానికి రాయలేదు.. సగటు పేద వాడి బాధ ని ఎవ్వరూ పట్టించుకోవట్లేదు అనే బాధతో రాస్తున్నా..బాధపడితే క్షమించగలరు)

5 comments:

  1. bava chala baga undi.... i am really proud of u keep it up.....

    ReplyDelete
  2. we have hundread reasons to seprate. do you have one single reason oppose.

    JT

    ReplyDelete
  3. helo shivudu garu
    correct ga cheperu meru.

    ReplyDelete
  4. @srinu garu..

    Sir, can you answer me 1 question, by forming a seperate state.. are all the problems in Telangana answered? If you are convinced the answer is YES then please let us all know why & how..

    Paalakulu endaru maarinaa.. peda vadi brathuku ippativaraku thellaaraney ledu.. (irrespective of regions & religions).. maarpu vyavastha lo raavaali kaani.. kevalam matti lo vasthey saripodu ani cheppey chinna prayatnam mathram..

    btw, I neither support seperation nor unification. My question is, does it make a difference to common man in Telangana. I am 100% sure it will benefit politicians as they can earn more money.. Even you would know that politicians in Telangana have earned a lot but common man hasn't changed in last 50 years.. my concern is only for a common man..on Humanitarian grounds..

    Thank you

    ReplyDelete
  5. Shiva,

    Well said and yes what you are saying is absolutely correct. Development should always start from the grass root level.

    high command maku emi chesindi telangane echhinda? ane kanna ne desaniki ne prantaniki either telangana or andhra nuvvu(mana praja pratinidhulu) emi chesaru ani vallani nila deesi adagavachhu ga evvaraite pranatyagalu bandh ento diryam to chestunnaru vallu, ade dairyam to me leaders ni adgavachhu ga development kosam, adi kakunda e banhs, strikes, moreover students life to adukuntunnaru........ this is not at all fair.........ani na abhiprayamu.

    ReplyDelete