ఈ సాయంత్రం మన "భవదీయులు" కేంద్ర హోంమంత్రి గారు ఒక "చల్లటి" ప్రకటన చేసారు.. అది ఎంత చల్లగా ఉందంటే.. ఆ చలికి ఎంతమంది చస్తారో అని కొంచం విచారంగా కూడా ఉంది..
అస్సలు ఆయన statement ఒకింత విస్మయాన్ని కలిగించింది కూడా. ఈయన గారు డిసెంబర్ 9 వ తేదీన తెలంగాణా రాష్ట్ర అవతరణ "ప్రక్రియ" మొదలెడుతున్నాం అని చెప్పినప్పటినుంచీ నాకు మనసుపొరల్లో ఎక్కడో కొంచం అనుమానం గానే ఉంది.. అస్సలు ఇది నిజామా లేక తరువాత "తూచ్" అంటారా అని.. తెలంగాణా ప్రాంతానికి చెందిన మా స్నేహితులు బాగా ఆనందపడినా నేను మాత్రం ఒకింత సంకోచిస్తూనే ఉన్నా.. అందుకే నేను వారితో "It is a carefully formed English statement. I am not sure if he did declare the formation of the state" అని అన్నాను. of course, వారు నా మాటలు పట్టించుకోలేదు అనుకోండి.. ఎందుకంటె basic గ మనిషి ఆశావాది.. ఎంతోకాలం నించి తెలంగాణా కోసం నిరీక్షించిన వారికి ఒక్కసారిగా.. రాష్ట్ర అవతరణ సంబంధిత వార్త వినగానే ఆ వార్త యొక్క details లోకి వెళ్ళకుండా ఒక్కసారిగా సంతోష పడిపోయారు..అదే విధంగా రాజకీయ నాయకులూ కూడా దాన్ని బాగా publicise చేసి, తెలంగాణా వచేసింది అని బాగా ప్రచారం చేసారు.. కానీ నా లాగే వారికి (నా స్నేహితులకి) కూడా అనుమానం ఉండినట్లే ఉంది.. ఎందుకంటే నేను తెలంగాణా వచ్చిన సందర్భంగా నా శుభాకాంక్షలు అని ఈమెయిలు పంపితే.. ఒక్కరు కూడా thanks అని reply పెట్టలేదు ..
సరే ఈ విషయం పక్కకు పెట్టి అసలు విషయానికి వస్తే .. సీమాంధ్ర నాయకుల "రాజకీయ" ఉద్యమం గురించి మనం చెప్పుకోవాలి.. వీళ్ళు చాలా పట్టుదలతో, దీక్షతో (ఇంతకుముందు వేరే వాళ్ళు చేసిన దీక్ష కూడా దీక్ష కాదులెండి.. దాన్ని పక్కకు పెడదాం) ఉద్యమించి, నానా యాగీ చేసే సరికి ... మొత్తానికి కేంద్ర ప్రభుత్వం మీరూ మీరూ కొట్టుకుని.. ఒకరు గెలవండి.. వాళ్ళు చెప్పినట్లు మేము చేస్తాం అని "అటు ఇటు కాని" statement ఒకటి ఇచ్చి.. చేతులు దులుపుకుంది..
నేను ఎన్నోరోజులుగా ఈ తెలంగాణా ఉద్యమాన్ని చూస్తున్నప్పటికీ.. తెలంగాణా ప్రాంత వాసులతో స్నేహం చేస్తున్నప్పటికీ.. అందరం తెలుగు వాళ్ళం అన్న feeling గమనించాను కానీ.. ఎక్కడ కూడా నీది ఆంధ్ర నాది తెలంగాణా అన్న మానసిక విభజన ని నేను గమనించలేదు.. కాని కేంద్ర ప్రభుత్వం చేసిన ఈ తలా తోకా లేని చర్య వల ఈనాడు మన తెలుగు ప్రజల్లో కలిగిన ఒక మానసిక విభజనకు సాక్షీభూతుడిని అవ్వడం నిజంగా నా దురదృష్టం..
ఎంత skeptical గా ఉన్నప్పటికీ.. తెలంగాణా రాష్ట్రం ఇస్తాం ఆని చెప్పి ఒకవేళ ఇవ్వకపోయినా.. కనీసం ఒక మంచి (మామూలు మంచి కాదు.. బ్రహ్మాండమైన) ప్యాకేజీ ఇచ్చి వెనుకబడిన ప్రాంతాలను అభివృద్ధి చేసే.. positive approach ఉన్న statement ఇస్తారు అని ఆశించాను.. కానీ ఇలా చేతగాని statement ఇస్తారు అనుకోలేదు..
ఈ statement ని చూసి సీమాంధ్ర "ఉద్యమ" నాయకులూ సంకలు గుద్దుకుంటూ ఉండొచ్చు (రహస్యంగా) కానీ నిజం చెప్పాలంటే.. ఇది నిజంగా "మేము సమైక్యంగా కలిసి ఉండాలి అనుకుంటున్నాం" అని గత పది రోజులు గ జన జీవనాన్ని స్తంబింప చేస్తూ.. అదే సమయం లొ వారి మీద "లాడు" కురిపిస్తున్న సీమాంధ్ర నాయకులకు ఒక పరీక్ష..
కలిసి ఉంటాం అని చెప్పినప్పుడు .. మనం కలిసి ఉంటున్న వాడి బాగోగులు మన భాద్యత.. కాబట్టి.. ఇన్నాళ్ళూ సమైక్యాంధ్ర కోసం పంచెలు ఎగ్గట్టి .. "ఊపుకుంటూ", ఊగిపోతూ ఉద్యమాలు చేసిన నాయకులందరూ..ఇపుడు రాష్ట్రంలొ వెనకపడిన ప్రాంతాల గురించి special package కోసం ఉద్యమం చెయ్యాలి.. అప్పటివరకు వాళ్ళు చేసిన రాజీనామాలు వెనక్కి తీసుకోకూడదు.. ఎందుకంటే .. తెలంగాణా కోసం ఉద్యమం చేసే వాడికి తెలంగాణా మీద ఎంత భాద్యత ఉంటుందో.. అంతకన్నా ఎక్కువగా.. "మేము కలిసే ఉంటాం" అని చెప్పే వాడికి ఉంటుంది.. కరక్టే ... కలిసి ఉంటె కలదు సుఖం.. కానీ "సుఖం" అన్ని పక్షాలకూ ఉండాలి.. ఒక పక్షానికే కాదు కదా..
కాబట్టి.. ఇంత ఉద్యమం చేసిన సమైక్యాంధ్ర నాయకులను, ప్రజలను, విద్యార్థులను, నేను కోరేది ఏంటంటే..
మీరు సమైక్యంగ ఉండాలి అన్నకోరికతో పాటూ మీకు వచ్చిన భాద్యతని కూడా takeup చేసి.. దానికోసం ఉద్యమించాలి..
ఈ అఖిలాంధ్ర, విశాలాంధ్ర, తెలంగాణా సహిత తెలుగు సమాజం లొ అణగారిన వర్గాల బాగు కోసం మీరు దీక్ష చెయ్యాలి.. ఉద్యమం చెయ్యాలి..చేస్తారా?
పట్టెడు అన్నం దొరక్క పోలోమని పొట్టచేతబట్టుకుని పరాయి ఊర్లకు వలస వెళ్ళే పేదవాడి కోసం ఉద్యమం చెయ్యాలి..
నీళ్ళు దొరక్క వేసిన పంట ఎండిపోతే, కూలి పనిచేసుకోడానికి సైతం పని దొరక్క ఆత్మహత్యలు చేసుకున్న రైతుల కోసం ఉద్యమం చెయ్యాలి..
కడుపునపుట్టిన బిడ్డలకి కడుపునిండా అన్నం పెట్టలేక.. పట్నంలో పనిమనిషి లా బ్రతకమని పంపే కన్నతల్లి కోసం ఉద్యమం చెయ్యాలి..
బలపం పట్టాల్సిన వయసులో గునపం పట్టుకుని పొట్ట నింపుకుంటున్న బిడ్డ చదువు కోసం ఉద్యమం చెయ్యాలి..
అన్నా అని పిలిచిన నోటికి ప్రతిరోజూ అన్నం అందించడం కోసం ఉద్యమం చెయ్యాలి.. ఉద్యమిస్తారా??
ఉద్యమిస్తారా?? ఆ దమ్ము మీలో ఉందా??
.........
No comments:
Post a Comment